Home News Telangana సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు

వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించారని.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాయి. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Share the post
Exit mobile version