మిల్కీబ్యూటీ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు తమన్నా భాటియా (Tamannaah Bhatia). ఉత్తరాది భామ అయినా దక్షిణాది పలు భాషల్లో నటించి మంచి తనను తాను నిరూపించుకుంది తమన్నా.

పేరుకు తగ్గట్టే పాల రాతి బొమ్మలా తమన్నా గ్లామర్ తో పాపులర్ అయింది. అటు గ్లామర్ తో పాటు యాక్టింగ్ లోనూ తన మార్క్ ను సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

హీరోయిన్ గా అరంగేట్రం చేసి దాదాపు 20 సంవత్సరాలు పూర్తి కావస్తున్నాయి. ఇక బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పనున్నారు ఈ అందాల భామ.

త్వరలో వివాహబంధంలోకి తమన్నా భాటియా..?
త్వరలోనే వివాహబంధం లోకి తమన్నా అడుగు పెట్టబోతున్నారని టాక్. ఎంసీఎ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ వర్మతో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరు ఇద్దరూ త్వరలో పెళ్లిపటలు ఎక్కబోతున్నారని గత కొంతకాలంగా బాలీవుడ్ లో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా తమన్నా తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి దివాలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక త్వరలోనే తమన్నా పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Also Read.. | ఫిలాసఫీ చెబుతున్న అనసూయ.. లేటెస్ట్ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రంగమ్మత్త
