Menu

telangana new ministers portfolios

ప్రభత్వ పథకాల రికవరీ నిలిపివేత

ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పధకాలను పొందే లబ్ది దారుల్లో పలువురు అనర్హులు ఉన్నట్టు పలు మార్గాల ద్వారాప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ ప్రభుత్వ పధకాలు మరింత సమర్థవంతంగా, అర్హులైన లబ్ధిదారులందరికీ అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం మేరకు, ఈ పధకాల అమలు తీరును క్రమబద్దీకరించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


అర్హులైన లబ్ధిదారులకు మరింత మెరుగుగా, సమర్థవంతంగా పథకాలను వర్తింపచేసేందుకు రాష్ట్ర శాసనసభ యొక్క రాబోయే బడ్జెట్ సమావేశాలలో, పధకాల అమలులో గుర్తించిన అవకతవకలను చర్చించి తగు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల ప్రయోజనాలను మరింత మెరుగ్గా అందించడం, అనర్హులు పొందుతున్న ప్రయోజనాలను గుర్తించి, వాటిని రికవరీ చేసే విధానాలకై ప్రభుత్వం త్వరలో స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఈ మార్గదర్శకాలను జారీ చేసే వరకు ప్రభుత్వం యొక్క వివిధ సంక్షేమ పథకాలలో చేర్చబడిన లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం లేదా మొత్తాలను రికవరీ చేయడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సచివాలయంలో అన్నివిభాగాలకు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

Share the post