మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సి.శైలజ (16) తుదిశ్వాస విడిచింది. అక్టోబర్ 30న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల 64 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో ముగ్గురు విద్యార్థినులు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అందులో తోమ్మిదో తరగతి చదువుతున్న శైలజ పరిస్థితి బాగా సీరియస్ గా ఉండడంతో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె శరీరం చికిత్సకు సహకరించక పోవడంతో సోమవారం రోజున ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో శైలజ తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడుస్తున్నారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.