ఉప్పల్ స్టేడియంలో ఆదివారం హైదరాబాద్, పంజాబ్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్ వైపు వచ్చే వాహనాలను హెచ్ఎండిఏ భగాయత్ రోడ్డు వైపునకు దారి మళ్లిస్తామని, వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.