సిద్దిపేట జిల్లా చేర్యాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు వాగు దాటేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేర్యాల మండలం వేచరేణి గ్రామానికి చెందిన బాలయ్య అనే వృద్ధుడు మరణించడంతో దహన సంస్కారాలు చేసేందుకు కుటుంబ సభ్యులు బంధులవులు నిర్ణయించారు. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామం పక్కనే వాగులోకి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. అంత్యక్రియలకు శవంతో పాటుగా నడుము లోతు నీటిలో నుండే వాగు దాటి అంత్యక్రియలు నిర్వహించారు. సోషల్ మీడియాలో శవంతో పాటు వాగు దాటుతున్నవీడియో వైరల్ అయింది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే పరిస్ధితి ఇలా ఉంటే మిగతా జిల్లాలలో ఏవిధంగా ఉంటుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. గ్రామాలలో ఒక ఫ్లై ఓవర్ కూడా కట్టలేని ప్రభుత్వం అని బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వాగుపై బ్రిడ్జి నిర్మించేందుకు గతంలో ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేసింది. కానీ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇంకా ప్రారంభం కాలేదు.
సీఎం సొంత జిల్లా అయిన సిద్దిపేట చేర్యాల మండలంలో ప్రజలు శవంతో వాగు దాటడం దురదృష్టకరం. కేబుల్ బ్రిడ్జిలు కట్టాం, ఫ్లై ఓవర్లు కట్టామని గొప్పలు చెప్పుకునే గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉండటం సిగ్గుచేటు. pic.twitter.com/HbaXXvK6Ac
— Dr Vivek Venkatswamy (@VivekVenkatswam) July 26, 2023