బుల్లితెర ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరామ్ చనిపోయి ఐదు రోజులు కాకముందే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ సూసైడ్ చేసుకున్నాడు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుకున్న పోలీసులు హుఠాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చందు ఆత్మహత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ జరుపుతున్నారు. చంద్రకాంత్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా, ఆరేళ్లుగా సీరియల్ నటి పవిత్ర జయరాంతో సహజీవనంలో ఉన్నాడు. ఆదివారం (మే 12) తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కారులో చందు కూడా ఉన్నారు. ఆయన చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. పవిత్రను ప్రాణంగా ప్రేమిస్తున్న చందు, ఆమె చనిపోయిర తర్వాత తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనకు బ్రెయిన్ వ్యాధి ఉందని చనిపోతానేమోనని ఇటీవలే చందు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంతలోనే ఆయన మరణించడంతో పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం సీరియల్స్ లో నటిస్తున్నారు.