కేసీఆర్ తోనే గిరిజనులకు సాధికారత: ఎమ్మెల్సీ కవిత

సీఎం కేసీఆర్ తోనే గిరిజనులకు సాధికారత కలిగిందని, రిజర్వేషన్ల పెంపుతో విద్య సంస్థల్లో గిరిజన బిడ్డలకు అడ్మిషన్లు పెరిగాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సబ్ ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 3300 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్ దని స్పష్టం చేశారు. జూమ్ యాప్ ద్వారా అంతర్జాతీయ బంజారా విద్యార్థుల సమావేశంలో కవిత మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి నిధులను వినియోగించలేదని, కానీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వినియోగిస్తోందని స్పష్టం చేశారు. ఒకవేళ ఒక ఏడాది నిధులు పూర్తిగా వినియోగంకాకపోతే ఆ నిధులు వచ్చే ఏడాదికి కూడా బదిలీ అయ్యేలా సీఎం కేసీఆర్ సబ్ ప్లాన్ కు రక్షణ కల్పిస్తూ చట్టాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీలే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, అన్ని సామాజిక వర్గాల సాధికారతకు పాటుపడుతున్నామని చెప్పారు. గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రేన్యూవర్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, రూ. 2 కోట్ల రుణం కూడా ప్రభుత్వం అందజేస్తున్నదని పేర్కొన్నారు.

తెలంగాణలో గిరిజన జనాభా పెరిగినందున ఎస్టీ రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము విజ్ఞప్తి చేశామని, కానీ కేంద్రం పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లను పెంచిందని స్పష్టం చేశారు. దాంతో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎస్టీ విద్యార్థుల ప్రవేశాల సంఖ్య పెరిగిందని అన్నారు. సీఎం కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలను చేయడం విప్లవాత్మక చర్య అని అన్నారు. 3300 తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవుల్లో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో, మెడికల్ షాపుల స్థాపనలో రిజర్వేషన్లు కల్పించామని వివరించారు. స్కాలర్ షిప్ లను అందిస్తునే ఉన్నామని, ఈ విషయంలో కేంద్రం మాత్రం అనేక ఆంక్షలు విధిస్తున్నదని, అయినా స్కాలర్ షిప్ లను కొనసాగిస్తున్నామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య, విద్య సౌకర్యాలను మెరుగుపర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూనే ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ నుంచి అనేక మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటుండడం సంతోషకరమన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా ఎదిగిందని తెలిపారు. హైదరాబాద్ కు అనేక పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని, జిల్లాల్లో కూడా ఐటీ పరిశ్రమలు వస్తుండడం సంతోషకరమన్నారు. మౌలిక సదుపాయాలను వికేంద్రీకరణ చేస్తున్నామని చెప్పారు. వివక్ష లేకుండా పరిపాలన చేస్తున్నామని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు కూడా అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు ఇస్తోందని, ఇలా బీఆర్ఎస్ పార్టీ సానుకూల రాజకీయాలు చేస్తున్నదని స్పష్టం చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

Telangana Talli: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే

సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ...

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

Topics

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img