Home News Telangana ఆర్టీసీ కురు వృద్ధుడు నరసింహా ఇకలేరు

ఆర్టీసీ కురు వృద్ధుడు నరసింహా ఇకలేరు

నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ (NSRRTD)లో ఉద్యోగంలో చేరి ఉమ్మడి రాష్ట్ర ఆర్టీసీకి సేవలందించిన 98 ఏళ్ల ఆర్టీసీ కురవృద్ధుడు టీఎల్ నరసింహా గారు మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాను. #Hyderabad ఓల్డ్‌ అల్వాల్‌లోని తన నివాసంలో ఇవాళ తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు.

20230824 131639

గత ఏడాది స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా టీఎల్‌ నరసింహ గారిని #TSRTC ఘనంగా సన్మానించింది. బస్‌భవన్‌లో జెండా పండగకు ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా వారిని సమున్నతంగా సంస్థ సత్కరించింది.


వజ్రోత్సవాలను పురస్కరించుకొని సంస్థ ట్యాంక్‌ బండ్‌పై చేపట్టిన ర్యాలీని నరసింహ గారే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఆ సమయంలో తన అనుభవాలను నాతో పంచుకున్నారు. సంస్థ కొత్తగా ప్రవేశపెడుతున్న కార్యక్రమాలను ఎంతగానో ప్రశంసించారు. టీఎస్‌ఆర్టీసీని ప్రజలకు మరింత చేరువ చేయడానికి సలహాలు కూడా ఇచ్చారు.

ప్రజా రవాణా వ్యవస్థకు ఎంతో సేవచేసిన ఆర్టీసీ కురవృద్ధుడు నరసింహా గారు మరణించడం బాధాకరం. టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. నరసింహా కుటుంబ సభ్యులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, హైదరాబాద్‌ శివారు బొల్లారంలో టీఎల్ నరసింహా గారు 1925లో జన్మించారు. 1944లో నిజాం స్టేట్‌ రైల్‌ అండ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ గుమస్తాగా ఉద్యోగంలో చేరారు. 1983లో ఆర్టీసీ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా పదవీ విరమణ చేశారు. నిజాం కరెన్సీ ఉస్మానియా సిక్కాలో రూ. 47 జీతంతో ఉద్యోగం మొదలుపెట్టిన ఆయన.. చివరగా రూ. 1,740 వేతనం అందుకొని రిటైరయ్యారు.

Share the post
Exit mobile version