ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో (Supreme Court) ఊరట లభించింది. ఈకేసును తెలంగాణ నుండి మధ్యప్రదేశ్ కు బదిలీ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. కేసు విచారణను ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారని పిటిషనర్ అపోహ మాత్రమేనని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ పిటిషన్ ను ముగిస్తున్నట్టు కోర్టు వ్యాఖ్యానించిది. మరోవైపు కేసు విషయాలను సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయకూడదని ఏసీబీని సుప్రీం కోర్టు ఆదేశించింది.