రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు నుండి పలు జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంటున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నాగర్ కర్నూల్, జనగాం, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హైదరాబారద్ లో చార్మినార్, ఖైరతాబాద్, ఎల్‌బీ నగర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, శేరిలింగంపల్లిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ తెలిపింది. రేపు, ఎల్లుండి కూడా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ నాగరత్న తెలిపారు.