రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదారాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతుండటంతో పాటు ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదారాబాద్ లో ఇవాళ సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.