మణిపూర్ హింసాకాండను నిరసిస్తూ హన్మకొండలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిముందు క్రైస్తవులు ప్రార్థనలు చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవులు మాట్లాడుతూ మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించి, దారుణంగా అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దేశంలో మహిళలపై రోజు రోజుకు అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయని అన్నారు. మహిళపై జరుగుతున్నదాడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టాలని అన్నారు. మణిపూర్ లో శాంతియుత వాతావరణం కోసం ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.