తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్నే అర్పించిన మహనీయుడు, తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం రోజున (జూన్ 21) జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. జయశంకర్ స్ఫూర్తి పదేళ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ఇమిడి ఉందని.. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ నేటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరింతగా ఇనుమడింప జేసే విధంగా పాలన అందించిన నాడే వారికి ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఅర్ తెలిపారు.