తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) ఎన్నికల్లో దిల్ రాజు ప్యానెల్ ఘన విజయం సాధించింది. నూతన అధ్యక్షుడిగా నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో దిల్ రాజు తన ప్రత్యర్థి అయిన సీనియర్ నిర్మాత సి.కల్యాణ్ పై విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 25 ఓట్లు అయితే దిల్ రాజుకు 31 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన అధ్యక్షునిగా గెలుపొందారు. ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో కీలక పోస్టులను దిల్ రాజు ప్యానెల్ కైవసం చేసుకుంది. ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు ఎన్నికయ్యారు. కార్యదర్శిగా దామోదర ప్రసాద్ విజయం సాధించారు. టీఎఫ్ సీసీ కోశాధికారిగా ప్రసన్నకుమార్ లు ఎన్నికయ్యారు.