ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు సోమవారం ప్రారంభమం అయ్యాయి. సెప్టెంబర్ 19 మంగళవారం నుండి నూతన పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీ ఉద్వేగంగా ప్రసంగించారు. పాత పార్లమెంట్ భవనం చారిత్రక ఘట్టాలకు వేదిక అయిందని ప్రధాని తెలిపారు. స్వాతంత్ర్యానంతరం ఈ భవనం ఎన్నో చట్టాలను చేసిందని గుర్తు చేశారు. గత ప్రధాని వజ్ పేయి ఆద్వర్యంలో చత్తీస్ గడ్, ఉత్తరాఖాండ్, ఝార్ఖండ్ మూడు రాష్ట్రాల విభజన జరిగినప్పుడు ఆయా రాష్ట్రాలలో ప్రజలు సంబరాలు చేసుకోవడంతో పాటు, ఉత్తరప్రదేశ్ లోనూ ప్రజలు సంబరాలు చేసుకున్నారని అన్నారు. కానీ, కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, అందువల్లనే తెలంగాణ రాష్ట్రం వేడుకలను సంతోషంగా జరుపుకోవడం లేదని ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించారు.