Menu

Image

ప్రధాని మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం

భారత ప్రధాని నరేంద్ర మోడీ గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ అవార్డు అందుకున్నారు. ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఆ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ చేతుల మీదుగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రోజు పారిస్ కు చేరుకున్న ప్రధాన మంత్రి మోడీకి రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. ఈ రోజు జరగనున్న ఫ్రెంచ్ జాతీయ వేడుకలకు మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకుంటున్న మోడీ ఫొటోలను విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ భారత ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపినట్టు బాగ్చి పేర్కొన్నారు. ఇక్కడి ప్రవాస భారతీయులను చూస్తే తాను ఇండయాలోనే ఉన్నాననే అనుభూతి కలిగిందని అన్నారు. అంతకు ముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టి మాక్రాన్ మోడీకి ప్రత్యేకంగా విందు ఇచ్చారు.

modi 2

ఫ్రాన్స్‌కు విదేశీయులు ఆర్థిక లేదాసాంస్కృతిక సేవలను అందించినా, మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛ లేదా ఫ్రాన్స్ సమర్థించే విషయాలకు అంతర్జాతీయంగా మద్దతు ఇచ్చినా.. వారికి ఈ అవార్డు అదిస్తారు. వారి ప్రమాణాల ప్రకారం దౌత్య పరమైన సంబంధాల ద్వారా ఫ్రాన్స్ విదేశాంగ విధానానికి మద్దతునిస్తూ అధికారిక వ్యక్తులకు గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ హానర్ ఇవ్వడానికి విదేశీ పర్యటనలు కూడా కొన్ని సందర్బాలలో పరిగణిస్తారు.

Share the post

Also Read..