హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 4901 దరఖాస్తులు అందాయి. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 157, విద్యుత్ శాఖ కు సంబంధించి 105, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 30, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 2865 దరఖాస్తులు వచ్చాయి. పౌర సరఫరాల శాఖకు సంబంధించి 1640 (రేషన్ కార్డులు) దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 109 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్.చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్ని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి ఆయన తెలుసుకున్నారు.

