భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటన ఖరారయింది. ఈనెల 23న ఉక్రెయిన్ లో ప్రధాని పర్యటిస్తారు. ఉక్రెయిన్ – రష్యా మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో, ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
నరేంద్ర మోడీ , కీవ్ పర్యటనకు ముందు, ఆగస్టు 21 మరియు 22న పోలాండ్‌లో పర్యటిస్తారు. పోలాండ్ నుంచి కీవ్‌కు ఆయన రైలు మార్గంలో ప్రయాణించనున్నారు. 23న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ ఉండనుంది. భారత్ , ఉక్రెయిన ద్వైపాక్షిక సంబందాలు మరింత బలోపేతం అవుతాయని తెలుస్తోంది. ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ విజయం సాదించిన సంధర్బంలో జెలెన్ స్కీ మోడీకి ఫోన్ చేసి అభినందించారు. తమ దేశానికి పర్యటనకు రావలసిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఖరారు అవడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది.