భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ సభ్యత్వ నమోదు (National Membership Drive) కార్యక్రమం ”సంఘటన్ పర్వ్, సదస్యత అభియాన్ 2024′‘ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖామంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు ఇతర అగ్రనేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ.. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ మాత్రమే కాకుండా, అత్యంత ప్రజాస్వామిక పార్టీ అని పేర్కొన్నారు. ”ఏ పార్టీ కూడా బీజేపీలా ఇంత పారదర్శకంగా, నిజాయితీతో సభ్యత్వ నమోదు చేయలేదు” అని ఆయన చెప్పారు. జాతీయ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన పార్టీ కార్యకర్తలను జేపీ నడ్డా స్వాగతించారు. దేశ ప్రధాన సేవకుడిగా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆయన మనందరికీ స్ఫూర్తి, రోల్ మోడల్ అని ప్రశంసించారు.
‘మిస్ట్ కాల్’ ద్వారా సభ్యత్వం
బీజేపీ లో సభ్యత్వం తీసుకోవాలంటే.. 88 00 00 2024 నంబరుకు మిస్డ్ కాల్ ద్వారా తీసుకోవచ్చని పార్టీ ప్రకటించింది. అమిత్ షా మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతి పెద్ద, శక్తవంతమైన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ, జేపీ నడ్డా ప్రారంభిస్తున్నారని, బీజేపీ శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, దేశప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని, పార్టీని సరికొత్త శిఖరాలకు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.
Watch LIVE…
— BJP (@BJP4India) September 2, 2024
Launch of BJP's National Membership Drive | भाजपा राष्ट्रीय सदस्यता अभियान 2024 का शुभारंभ#BJPSadasyata2024
https://t.co/AxLQ112wIc