మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాలకు(Machilipatnam Medical College) భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరును ఖరారు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలలో స్పూర్తి నింపేలాగా పింగళి వెంకయ్య మువ్వన్నెల జెండాను జాతికి అందజేశారు. మచిలీపట్నంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు ఆయన పేరు పెట్టడం ద్వారా ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి భావితరాలకు అందుతుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్య పేరును నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు.