ఆంధ్రా వాళ్ల డబ్బుతోనే టీఆర్ఎస్ పార్టీ స్థాపన.. త్వరలో విధ్యుత్ ఫైల్స్: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రభుత్వ అరుపులు చనిపోయే ముందు గావు కేకల్లాంటివిని.. ఉచిత విధ్యుత్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీది కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అప్పటి HRD లో కీలకంగా ఉన్న కేసీఆర్ ఆదేశాలమేరకే బషీర్ బాగ్ కాల్పులు జరిగాయని.. గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచార శ్రీనివాస్ రెడ్డిలు అందరూ కలిసే విధ్యుత్ పాలసీ తయారు చేశారని.. వీరంతా కాల్పులకు కారణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను టీడీపీలో చేరింది 2007లో అయితే.. బషీర్ బాగ్ కాల్పులు జరిగింది 2000 సంవత్సరంలో.. అయితే కాల్పులకు, తనకు సంబంధం లేదని రేవంత్ స్ఫష్టం చేశారు. టీడీపీలో మంత్రి పదవి కోసం చంద్రబాబు చెప్పులు మోసెందుకు కేసీఆర్ సిద్ధపడింది నిజం కాదా అని ప్రశ్నించారు. తుమ్మల, మండవ, బొజ్జల, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమూరి రాధాకృష్ణ లాంటి వారే ఇందుకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నారని సీఎం కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బొజ్జల ఇచ్చిన డబ్బులతోనే ఆనాడు కేసీఆర్ టీఆరెస్ పార్టీ స్థాపించారన్నారని ఆరోపంచారు. 2000 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వంతో విభేధించి బయటకు వెళ్లి.. 2009 ఎన్నికల్లో చంద్రబాబుతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు.

వార్డు మెంబర్ గా కూడా గెలవని హరీష్‌ రావును మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఏ సబ్ స్టేషన్ పరిధిలో అయినా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వలేదని తేలుతుందో ఆ గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని… రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ వచ్చే గ్రామాల్లో మేం ఓట్లు అడగం అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రాష్ట్రంలో వెలుగులు నింపింది నిజంగానే కేసీఆర్ అయితే, వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించాలని అన్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని ప్రకటించండని సవాల్ విసిరారు. తాను 20 సంవత్నరాలుగా ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడుతున్నానని అన్నారు. రాష్ట్రంలో విధ్యుత్ కొనుగోళ్లలో అవక తవకలు జరిగాయని.. త్వరలోనే విధ్యుత్ ఫైల్స్ విడుదల చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img