భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతోందని, పాకిస్థాన్‌కు కూడా అటువంటి నాయకుడు అవసరమని ప్రముఖ పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిత్ తరార్ అన్నారు. భారత్ గతంలో తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలు ప్రస్తుతం ఫలితాలు ఇవ్వడం ప్రారంభించాయని అన్నారు. అమెరికాలో ట్రంప్ విజయం సాధిస్తే, అమెరికా తిరిగి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆయన అని అభిప్రాయపడ్డారు.
భారతీయులకు నరేంద్ర మోడీ ఇచ్చిన జాతీయవాద నినాదం ఎంతో ప్రయోజనాన్ని అందించిందని అన్నారు. ముఖ్యంగా ఇండియా, అమెరికాల్లో పనిచేస్తున్న భారతీయులకు జాతీయవాద నినాదం చాలా ఉపయోగపడిందని అన్నారు. చాలా రంగాల్లో భారతీయులదే పై చేయిగా ఉందని అన్నారు. వాషింగ్టన్ లో అది స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ నేర్చుకుని, విద్యా రంగంపై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు.
భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, తొలి విద్యాశాఖా మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ల ఆలోచనలకు అనుగుణంగా ఏర్పడిన ఐఐటీ మరియు ఐఐఎం సంస్థలు దీర్ఘకాల ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడి పెడితే, ఇలాంటి ఫలితాలే వస్తాయని భారత్ పై ప్రశంసలు కురిపించారు. పాకిస్థన్ కు నరేంద్ర మోడీ లాంటి నాయకుని అవసరం ఉందని ఆయన అన్నారు.
ఎవరీ సాజిత్ తరార్..?
1990వ దశకంలో పాకిస్థాన్ నుండవి అమెరికాకు వెళ్లిన సాజిత్ తరార్ కు పాక్ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాల్టిమోర్‌కు చెందిన ఆయన, అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి మద్దతుదారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అధికారంలోకి వస్తే, అమెరికా తిరిగి గొప్ప మార్గంలో పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రంప్ అధికారంలోకి వస్తే అమెరికాను తిరిగి గొప్ప స్థాయిలో ఉంచేందుకు కృషి చేస్తున్నాడని.. డెమోక్రాట్ నాయకులు ఈ విధంగా పనిచేయరని అన్నారు. ట్రంప్ చైనా విధానాలను అనేక వేదికలపై బహిరంగంగానే విమర్శించారని తరార్ గుర్తుచేశారు.