నీట్ పరీక్షలో జరిగిన అవినీతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి వెంటనే పరీక్షను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు కోరాయి. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై స్టూడెంట్ లీడర్స్ మాట్లాడారు. ఎమ్మెల్సీ బాల్మూరి మాట్లాడుతూ.. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో బీజేపీ ప్రభుత్వం ఆటలు ఆడటం దుర్మార్గమని విమర్శించారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని బండి సంజయ్ సూచించారు. రేపు అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదారాబాద్ లో స్టూడెంట్స్ మార్చ్ నిర్వహిస్తామని బల్మూరి వెంకట్ తెలిపారు.
