నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక తొలిసారి ఎన్‌డీఏ సమావేశం ఢిల్లీలో జరిగింది. బీజేపీతో సహా 38 పార్టీలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీయే సమావేశం జరిగింది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీయే సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 20 నుండి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కూడా ఈ మీటింగ్ లో చర్చించారు. ముఖ్యంగా పలు కీలక బిల్లుల ఆమోదం కోసం మద్దతు విషయంలో కూడా ఈ మీటింగ్ లో చర్చించారు. సమావేశం అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 2024 కూడా ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని అన్నారు. ఎన్డీయే దేశం కోసం పని చేస్తందని ఆయన అన్నారు. 2014 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీయేకు 38 శాతం, 2019లో 45 శాతం ఓట్లు వచ్చాయి. 2024 ఎన్నికల్లో ఎన్డీయేకు 50 శాతం ఓట్లు వస్తాయని విశ్వసిస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు.