జమిలి ఎన్నికలకు (one nation one election) మోడీ 3.O ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధానంగా సార్వత్రిక ఎన్నికలు ఒకసారి, తరువాత వరుసగా రాష్ట్రాలల ఎన్నికలు జరగడం, వీటితోపాటు పంచాయితీ ఎన్నికలు వివిధ సమయాల్లో జరగడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గతం నుండి బీజేపీ పార్టీ చెబుతూ వస్తోంది. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వలస కార్మికులకు, ఇతర ఉద్యోగ, వ్యాపారల కోసం వలస వెళ్లినవారు తరచూ ఎన్నకలకు రాలేరని, తద్వాదా ఓటింగ్ కూడా గణనీయంగా పడిపోతుందని అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, దీనికి పరిష్కారం జమిలీ ఎన్నికలేనని అధికార పార్టీ భావిస్తోంది.
మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ గోవింద్ కమిటీ జమిలి ఎన్నకలపై ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి నివేదిక అందించారు. జమిలి ఎన్నికల అవసరాన్ని ఆ కమిటీ కూడా గుర్తించి ప్రభుత్వానికి నివేదికి అందించింది. గత నెలలో జరిగిన సమావేశంలో ఈ నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు ఎన్డీయే ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవల జరిగిన దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ జమిలి ఎన్నకలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో తరచూ ఏదో ఒకచోట ఎన్నకలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. తద్వారా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి అమలులో ఉండడం జరుగుతుందని.అన్నారు. జమిలిని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. జమిలిని అమలు చేమాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని పలువు భావిస్తున్నారు. లోక్ సభలో ఎన్డీయే ప్రభుత్వానికి మోజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా ఇతర పార్టీల మద్దతు కూడగట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ సవరణకు రాష్ట్రాల అసెంబ్లీల మద్దతు అవసరం అయితే ఇప్పటికే దాదాపు సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి బీజేపీ ఖశ్చితంగా జమిలి ఎన్నకలకు ముందుకు వెళ్లే అవకాశం ఉందని దేశంలో పలు పార్టీలు భావిస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత 2029లో మళ్లీ ఎన్నికలు జరగాలి. కానీ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం జమిలి ఎన్నికలకు అంతా సిద్దం చేసి 2027 ద్వితీయార్థంలో ఎన్నికలకు వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇదే జరిగితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలను ఎప్పుడు రద్దు చేస్తారు అనేది ప్రధానాంశంగా మారనుంది. మెత్తానికి దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు అతి త్వరలోనే ఉంటాయని ఎన్డీయే ప్రభుత్వ స్పీడ్ చూస్తే అర్ధం అవుతుంది. జమిలి ఎన్నికల వల్ల జాతీయ అంశాలు చర్చకు వచ్చి జాతీయ పార్టీలకు లాభం జరుగుతుందని కొందరు భావిస్తున్నారు. తద్వారా ప్రాంతీయ పార్టీల అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతుందని అంటున్నారు.
2027లో జమిలి ఎన్నికలు ఉంటాయా.. లేదా 2029 వరకు వేచి చూసి అప్పుడు సార్వత్రిక ఎన్నికలకు వెళ్తారా.. అనేది తెలియాలంటే ఇం కాసమయం పట్టే అవకాశం ఉంది. బిల్లు పార్లమెంటులో ఆమోదించిన తర్వాత, చట్టరూపం దాల్చాక గానీ దాని పూర్తి వివరాలు తెలియవు. గతంలో కొన్ని పార్టీలు జమిలి ఎన్నికలకు అనుకూలమని కేంద్ర ప్రభుత్వానికి మద్దతు లేఖలు ఇచ్చాయి. మరికొన్ని పార్టీలు వ్యతిరేఖించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జమిలిపై రాజకీయ పార్టీల మద్దతు ఏవిధంగా ఉంటుందో చూడాలి. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జమిలిని వ్యతిరేఖిస్తుంది. ఇది సమాఖ్య విధానానికి తూట్లు పొడిచినట్లేనని విమర్శిస్తోంది. కొన్ని పార్టీలు జమిలీ ఎన్నకలు ఖచ్చితంగా జరుగుతాయని ఇప్పటినుండే ఎన్నకలకు సన్నధ్దం కావాలని తమ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు.