అనారోగ్యంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ కోలుకున్నారని, ఆయనను డిశ్చార్జి చేశామని చెన్నై అపోలో వైద్యులు ప్రకటించారు. ఆదివారం అపోలో మేనేజ్ మెంట్ మీడియాకు ప్రకటనను విడుదల చేసింది. శనివారం రాత్రి అస్వస్థతకు గురైన రెహమాన్ ను ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్పించారు. ఛాతి నొప్పితో బాధపడుతున్న రహమాన్ ను అపోలో స్పెషలిస్టుల వైద్య బృందం వైద్యపరీక్షలు నిర్వహించి పరీక్షించారు.

డీహైడ్రేషన్ కారణంగా రహమాన్ అస్వస్థతకు గురయ్యారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత రహమాన్ కోలుకున్నారని.. ఆయనను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రిహానా తెలిపారు.
Also Read.. | తెలంగాణ హిస్టరీ, ఫ్యూచర్ కేసీఆరే: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత