వర్షాకాల శాసన సభ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సమావేశాలను 20 రోజుల పాటు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అయినా మూడు రోజుల పాటే సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజుల తర్వాత సభను అవసరం అయితే పోడిగించే అంశాన్నికూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మీటింగ్ లో నిర్ణయించారు.