గ్యారంటీలకు గాంధీలు… క్షమాపణలకు బంట్రోతులా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని పేర్కొన్నారు. అమరవీరులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలపై “ఎక్స్” ద్వారా కవిత ఘాటుగా స్పందించారు.
పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా అంటూ నిలదీశారు. గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా అంటూ ఆక్షేపించారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా? అని అడిగారు. “పదేండ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం!. ఈ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జై తెలంగాణ చెప్పకపోవడం దారుణం. ఈ రోజుకీ మీకు అమరవీరుల స్థూపానికి దారి తెలియకపోవడం అత్యంత బాధాకరం.” అని పేర్కొన్నారు.
Gandhis for guarantees, Durbaaris for apologies???!!
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 17, 2023
Can't the Gandhis who deceived Telangana for six decades apologise?
The Gandhi family's disregard for the agony of hundreds of mothers for over a decade is disheartening.
It is unfortunate that they could do a Jodo Yatra on… pic.twitter.com/wbNRS7OQAc