MLC Kavitha: ముగిసిన కవిత ఈడీ విచారణ.. 16న మరోసారి హాజరవాలని నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ ముగిసింది. దాదాపు తొమ్మిది గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. రాత్రి 8 గంటల సమయంలో ఆమె ఈడీ ఆఫీసు నుంచి బయటకు వచ్చారు. ఆమె ఈడీ ఆఫీస్ నుంచి నేరుగా తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కవితను ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో విచారణ ఇంకా పూర్తి కాలేదని.. మార్చి 16న మరోసారి కవితను విచారించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. 100 కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ ద్వారా ఆప్(AAP) పార్టీకి ఇచ్చినట్లు మనీష్‌ సిసోడియా, రామచంద్ర పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు, మాగుంట రాఘవ రెడ్డిలు ఈడీకి ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు.

కవిత స్టేటమేంట్ ను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA-Sec-50) సెక్షన్ 50 ప్రకారం అధికారులు రికార్డ్ చేశారు. విచారణలో లిక్కర్ స్కాం గురించి తనకేం తెలియదని.. తాను కుట్రదారుని కాదని ఆమె స్పష్టం చేశారు. తాను ఎటువంటి ఆధారాలు ధ్వంసం చేయలేదని ఈడీ అధికారుల ప్రశ్నలకు కవిత సమాదానం ఇచ్చారు. కవితను ప్రశ్నించే సమయంలో.. అరుణ్ పిళ్లై కూడా అక్కడే ఉన్నారు. గతంలోని విచారణ సంధర్భంగా తాను కవిత బినామీని అని పిళ్లై ఇచ్చిన స్టేట్ మెంట్ఆ ధారంగా.. రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును అధికారులు ప్రస్తావించారు. తర్వాత తన స్టేట్ మెంట్ ను ఉప సంహరించుకుంటున్నట్లు పిళ్లై రిట్ పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అతని సమక్షంలోనే కవితను ఇంటరాగేషన్ చేయటం విశేషం.

దాదాపు తొమ్మిది గంటల పాటు సాగిన ఈడీ విచారణ తర్వాత.. ఆఫీసులో నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత ముఖంలో చిరునవ్వు కనిపించింది. జై కవితక్క.. అంటూ కార్యకర్తల నినాదాల మధ్య ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని ఇంటికి కవిత చేరుకున్నారు. ఆమెకు కుటుంబ సభ్యులు మంగళ హారతి ఇచ్చి, గుమ్మడికాయతో దిష్టితీసి ఇంటిలోనికి ఆహ్వానించారు. కవితతో ఆమె భర్త, పలువురు బంధువులు ఉన్నారు. ఈడీ అధికారులు 9 గంటలపాటు కవితను విచారించారు. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని కవితకు నోటీసులిచ్చినట్లు సమాచారం.

సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అధికారులు ఆ సమయాన్ని అనూహ్యంగా పెంచారు. రూల్స్ ప్రకారం అయితే మహిళలను సాయంత్రం 6 గం. వరకు మాత్రమే విచారించాలి. కానీ సమయం దాటినా కూడా కవితను అధికారులు బయటకు పంపలేదు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే, తరువాత కవిత బయటికి రావడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు సంతోషంగా ఈలలు, కేరింతలు, నినాదాలతో హోరెత్తించారు.

ఉదయం నుండి హై టెన్షన్..

ఉదయం నుండి పడిన టెన్షన్ ఒక్కసారిగా పోయినట్లు వారి ముఖాల్లో సుస్పష్టంగా కనిపించింది. గత రెండు మూడు రోజుల నుండి కూడా కవిత అరెస్ట్ అవుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ నేపథ్యంలోనే మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ కూడా ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ లీగల్ టీమ్ తో చర్చిస్తూ ఉన్నారు. ఈడీ అధికారుల చర్యలు ఎలా ఉంటాయోననే అంశంపై రోజంతా అప్రమత్తంగా ఉన్నారు. వారు ఊహించినట్లు ఏమీ జరగలేదు. పైగా చిరునవ్వుతో కవిత ఇంటికి రావటంతో అక్కడి వారి అందరి ముఖాల్లో సంతోషం వెల్లు విరిసింది. ఇంటి వద్ద కోలాహలం నెలకొంది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నబీఆర్ఎస్ మంత్రులు, ముఖ్య నేతలు, అనుచరులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు తరలిరావడంతో ఢిల్లీ పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

kavitha in ED office

ప్రశ్నలు అన్నీ ఈ విధంగానే..!

శనివారం జరిగిన కవిత విచారణ మొత్తంలో మొబైల్ ఫోన్లు ధ్వంసం చేసినట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్‌లోని సౌత్ గ్రూప్పా త్రపైనా విచారించారని సమాచారం. అంతే కాకుండా అరుణ్ పిళ్లై ఈడీ రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్సాన్ని కురిపించారని తెలుస్తోంది. కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఫోన్ వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా కొన్ని ప్రశ్నలు అడిగారని సమాచారం. కవిత- రామచంద్ర పిళ్లై ఇద్దరితో కాన్‌‌ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ పద్దతి ద్వారా అధికారులు విచారించారని సమాచారం. కవితతో పాటుగా మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా (Manish Sisodia), కల్వకుంట్ల కవిత, అరుణ్ రామచంద్ర పిళ్లై, దినేష్ అరోరా, గోరంట్ల బుచ్చిబాబు, మనీష్ సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ పూర్వ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్‌లను విడివిడిగా ఒకసారి, కలిపి మరోసారి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img