ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) కి దాదాసాహెబ్ పాల్కే అవార్డు (Dadasaheb phalke award)కు ఎంపికయ్యారు. మనదేశంలో సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. ఈ అవార్డుకు ఈసంవత్సరం మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini vaishnaw) ప్రకటించారు. అక్టోబర్ 8వ తేదీన జరగనున్న 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ వేడుకల్లో ఈ అవార్డును అందజేస్తారు. బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించిన మిథున్, 1982లో విడుదలయిన “డిస్కో డ్యాన్సర్” సినిమాతో విశేష జనాదరణ పొందారు.
Also Read.. Priyanka chopra, samantha: ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రియాంకా చోప్రాతో సమంత
పశ్చిమ బెంగాల్ కు చెందిన 74 యేళ్ల మిథున్ చక్రవర్తి హిందీతో పాటు, ఒడిశా, భోజ్‌పురి, బెంగాలీ, తమిళ, కన్నడ, పంజాబీ బాషల్లో 350కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన “గోపాల గోపాల” మల్టీస్టారర్ మూవీలో స్వామీజీ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారు. 1976లో మృణాల్ సేన్ కళాత్మక చిత్రం మృగయాతో హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. ఈసినిమాకు ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు.
మిథున్ చక్రవర్తి రాజకీయాల్లో కూడా ఆసక్తి కనబరిచారు. మమతా బెనర్జీ ఆద్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) తరపున 2014లో రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే తాను రెండు సంత్సరాలకే (2016లో) ఆపదవికి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరారు.
Mithun Da’s remarkable cinematic journey inspires generations!
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) September 30, 2024
Honoured to announce that the Dadasaheb Phalke Selection Jury has decided to award legendary actor, Sh. Mithun Chakraborty Ji for his iconic contribution to Indian Cinema.
🗓️To be presented at the 70th National…