ప్రవాస భారతీయుల మిస్ వరల్డ్ వైడ్ 2024 పోటీలు తాజాగా అమెరికాలో జరిగాయి. అమెరికాకు చెందిన ధ్రువీ పటేల్ ఈ పోటీలలో విజేతగా నిలిచారు. 31వ మిస్ వరల్డ్ వైడ్ 2024 పోటీలు న్యూజెర్సీలో అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీలలో మిసెస్, టీన్స్ తొ పాటో ఇతర విభాగాల్లో పోటీల్లో మహిళలు పోటీపడ్డారు. ఇందులో ధ్రువి పటేల్ విజయం సాధించి, కిరీటాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అభ్యసిస్తున్నారు.
విజయం సాధించిన తరువాత ధ్రువీ పటేల్ మాట్లాడుతూ.. మిస్ వరల్డ్ వైడ్ విజేత 2024గా గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తనకు వచ్చింది కేవలం కిరీటం మాత్రమే కాదని.. ఇది ట్రెడీషన్, కల్చర్ కు ప్రతీక అని తెలిపారు. తనకు అవకాశం వస్తే బాలీవుడ్ లో హీరోయిన్ గా నటించాలని ఉందని ధ్రువీ తన మనసలోని కోరికను బయటపెట్టింది. అంతేకాదు, యూనిసెఫ్ కు అంబాసిడర్ గా కూడా తనకు ఉండాలని ఉందని చెప్పుకొచ్చింది.
మిసెస్ విభాగంలో ట్రినిడాడ్ అండ్ టొబాగోకు చెందిన సువాన్ మౌటెట్ విజేతగా నిలిచారు. స్నేహ నంబియార్ మొదటి రన్నరప్ గా.. యూకేకు చెందిన పవన్‌దీప్ కౌర్ రెండవ రన్నరప్‌గా నిలిచారు. ఈ అందాల పోటీని న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహిస్తుంది.