జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం ను పురస్కరించుకొని హైదరాబాద్ లోని రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్ లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ చించారు. పిల్లల శారీరక ఎదుగుదలకు సంబంధించి డీ వార్మింగ్ టాబ్లెట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య ను అందిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలకు, ఆసుపత్రులకు ప్రజలే ఓనర్లరన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం, విద్య, వైద్యానికి కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 లక్షల ఆల్బెండజోల్ టాబ్లెట్లను విద్యార్థులకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో అంగన్వాడి సెంటర్ లలో 1వ సంవత్సరం నుండి 19వ సంవత్సరాల వయసు గల పిల్లలకు టాబ్లెట్లను అందిస్తున్నామన్నారు. నేటి నుండి జూన్ 27 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం ఈ ట్యాబ్లెట్లు వేయించాలన్నారు.