Home News Telangana మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ

మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కొండా సురేఖ

మంత్రి కొండా సురేఖ తన నిర్మల హృదయాన్ని మరోసారి చాటుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండకు బయలుదేరిన మంత్రి మార్గమధ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను దగ్గరుండి 108 లో హాస్పటల్ కు తరలించారు. 108 సిబ్బందికి రోడ్డు ప్రమాదం జరిగిన స్థలానికి సంబంధించిన వివరాలను అందిస్తూ, వారిని గైడ్ చేశారు. క్షతగాత్రుల వివరాలు తెలుసుకొని, వారి కుటుంబాలకు సమాచారం అందించడంతో పాటు, చికిత్స ఏర్పాట్లను పరిశీలించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వేసవి కాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాల్సిందిగా మంత్రి సురేఖ ప్రజలకు సూచించారు.

https://news2telugu.com/wp-content/uploads/2024/04/1000584654.mp4
Share the post
Exit mobile version