తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క వద్ద తెలంగాణ బీజేపీ ఆద్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష చేస్తోన్ కిషన్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దీక్షకు పోలీసులు బుధవారం సాయంత్రం 6 గంటల వరకే పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన గడువు అవగానే.. వారు దీక్షా స్ధలానికి వచ్చారు. వేదిక వద్ద ఉన్న అందరూ శిభిరాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని పోలీసులు కోరారు. అయితే అందుకు కిషన్ రెడ్డి నిరాకరించారు. గురువారం సాయంత్రం వరకు దీక్ష కొనసాగిస్తానని తేల్చి చెప్పారు. అందుకు పోలీసులు ఒప్పుకోలేదు. బలవంతంగా కిషన్ రెడ్డి దీక్షను భగ్నం చేసి పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. కిషన్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులకు బీజేపీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పలువురు బీజేపీ కార్యకర్తలకు, దీక్షా శిభిరాన్ని కవర్ చేస్తున్న కెమరామెన్లకు గాయాలు అయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, మహిళా కార్యకర్తలు కింద పడ్డారు. దీంతో దీక్ష శిబిరంవద్ద అంతా గందరగోళ వాతావరణం నెలకొన్నది.
తెలంగాణ ఏర్పాటే నీళ్లు, నిధులు, నియామకాల కోసం సబ్బండ వర్గాలు పోరాటం చేశాయని కిషన్ రెడ్గి గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో యువత ముందుండి పోరాటం చేశారని అన్నారు. ఎంతోమంది తమ ప్రాణాలను సైతం అర్పించారని అన్నారు. తెలంగాణ వస్తే తమ బ్రతుకులు బాగు పడుతాయని, ఉద్యోగాలు వస్తాయని యవత భావించిందని అన్నారు. కానీ గత 9 సంవత్నారాలుగా కేసీఆర్ సర్కార్ యువతకు తీవ్ర అన్యాయం చేసిందని విమర్శించారు. 2018లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో నిరద్యోగులకు ప్రతి నెల 3వేలు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ అధికారంలోనికి వచ్చాక కేసీఆర్ యువతను మోసం చేశారని కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ తీరు వల్ల రాష్ట్రంలోని 30 లక్షల యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. అదే విధంగా రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున దళిత బంధు పథకం అమలు చేస్తామని చెప్పి.. కేవలం దానిని ఉప ఎన్నికలు జరిగే నియోజక వర్గాలకే పరిమితం చేశారని కిషన్ రెడ్డి అన్నారు.
Live: BJP Telangana State Office, Nampally, Hyderabad.#BJPStands4Youth @BJP4Telangana https://t.co/qn9c0US7Fb
— G Kishan Reddy (@kishanreddybjp) September 13, 2023