Menu

  • Home
  • సినిమా
  • Chiranjeevi: చిరంజీవికి అరుదైన గుర్తింపు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు
Image

Chiranjeevi: చిరంజీవికి అరుదైన గుర్తింపు.. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. భారతీయ సినీనటులకు ఎవరికీ సాధ్యంకాని ఘనత సాధించినందుకు ఈ స్థానం లభించింది. మెగాస్టార్ ఇప్పటివరకు 156 సినిమాల్లో నటించి, 537 పాటల్లో డ్యాన్స్ లు చేశారు. ఈ పాటల్లో మెత్తం 24 వేల మూమెంట్స్ చేసినందుకు గాను చిరంజీవిని గిన్నిస్ బుక్ వారు గుర్తించి, ఆయనకు సముచిత స్థానం కల్పించారు.

ఆదివారం హైదరాబాద్ లోని హోటల్ ఐటీసీ కొహినూర్ లో చిరంజీవికి గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు పర్టిఫికెట్ అందుకున్నారు. ఈకార్యక్రమంలో టాలీవుడ్ ప్రముఖులు, మెగా కుటుంబసభ్యులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఈసంధర్బంగా మెగాస్టార్ మాట్లాడుతూ.. తనకు నటనతోపాటు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో తెలిపారు.చిన్నప్పటినుండి డ్యాన్స్ అంటే ప్రాణం అని అన్నారు. తనకు ఉన్న ఈ extra క్వాలిఫికేషన్ వల్లే సినిమాల్లో అవకాశాలు వచ్చియని తెలిపారు. తన డ్యాన్స్ కు ప్రపంచ స్థాయి అవార్డు వచ్చినందకు చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలిపారు. ఈ అవార్డు రావడంలో తన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు అభిమానుల పాత్ర కీలకమైందని మెగాస్టార్ తన సంతోషాన్ని పంచుకున్నారు.

Share the post