సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు లో పందిళ్ళ ఆగమల్లు (60) గుండెపోటుతో మృతించెందాడు. శుక్రవారం రాత్రి ఛాతిలో నొప్పి రావడంతో సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు (శనివారం) ఉదయం ఆయన మరణించారు. ఆగమల్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బార్బర్ గా సేవలు
ఆగమల్లు గత 40 సంవత్సరాలుగా మంగళి (బార్బర్) వృత్తి ద్వారా గ్రామస్థులకు సేవలు అందిస్తున్నారు. అందరితో సరదాగా మాట్లాడే వ్యక్తి ఇలా హఠాత్తుగా గుండె పోటుతో చనిపోవటం బాధాకరమని పలువురు గ్రామస్థులు అంటున్నారు.