పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ సభలో మాట్లాడుతూ.. తనను దేవుడే పంపించాడని, దేశప్రజల సేవకోసం భూలోకానికి పంపాడని వ్యాఖ్యానించారు. ఈవ్యాఖ్యలపై దీదీ ప్రధాని మోడీకి చురకలు అంటించారు. దేవుళ్లు రాజకీయాలు చేయరని, అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు చేయరని విమర్శించారు. అంతే కాకుండా మోడీ నిజంగానే తనను తాను దేవునిగా భావిస్తే.. ఆయనకు ఒక గుడిని నిర్మిస్తానని.. ప్రసాదంగా గుజరాత్ వంటకం డోక్లా పెట్టి, నిత్యం పూజలు చేస్తానని అన్నారు. ఇక గుళ్లోనే కూర్చోండని ప్రధాని మోడీకి కౌంటర్ ఇచ్చారు.