గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. వరద భాదితులను ఆదుకోవాలని వినతి

కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్కనేతృత్వంలో గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ ను కలిశారు. రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో ప్రజలు నష్టపోయిన పరిస్థితులను గవర్నర్ కు నేతలు వివరించారు. వరద బాధితులకు ప్రభుత్వం తరపున నష్ట పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. అతంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాల గురించి సమాచారం సేకరించి గవర్నర్ కు వివరించామని అన్నారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినా.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ విషయాన్నిగవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగాన్ని వర్షాలకు ముందు సమయాత్తం చేయకుండా, ప్రభుత్వ పెద్దలు ఎలాంటి సమీక్షలు నిర్వహించకుండా నిర్లిప్తంగా ఉన్నందునే రాష్ట్రంలో ఇంత నష్టం జరిగిందని అన్నారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం భారీ, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క వార్షిక మెయింటెనెన్సుకు నిధులు కూడా విడుదల చేయకుండా నర్లక్ష్యం చేసినందునే.. వరదలు ముంచెత్తాయని అన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం శాస్త్రీయంగా జరగక పోవడం వలనే చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయని అన్నారు. కిన్నెరసాని, మున్నేరు నదులపై నిర్మించిన చెక్ డ్యాములు ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి నిర్మించి ఉంటే ఇంతటి నష్టం వాటిల్లేది కాదన్నారు.

రాష్ట్ర ప్రజల అవసరాల కోసం కాకుండా కేసీఆర్ రాజకీయ అవసరాల కోసమే అధికార యంత్రాంగాన్ని వాడుకోవటం వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది అని ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. భద్రాచలం నుండి ఆదిలాబాద్ వరకు ఏజెన్సీ గిరిజన గూడాల పరిసర ప్రాంతాలు గోదారి వరదలతో నీట మునిగే ముప్పు ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, పోదేం వీరయ్య, దుద్దిల్ల శ్రీధర్ బాబు లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసి రెస్క్యూ టీమ్ లను పంపించాలని కోరినా.. ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని వమర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

ఖేలో ఇండియా 2026కు వేదికగా హైదరాబాద్.. కేంద్రం సుముఖం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి మేరకు ఖేలో ఇండియా – 2026...

ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులు వీరే.. సీఎం రేవంత్ గుడ్ న్యూస్ !

తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న ఇందిర‌మ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేద‌ల‌కు...

హైదరాబాద్ – టర్కీల మధ్య నిజాం కాలం నుండే సత్సంబందాలు

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహతో...

మన్నెగూడ రోడ్డు పనులు ఎందుకు ప్రారంభించడం లేదు.. మంత్రి కోమటి రెడ్డి సీరియస్

రాష్ట్రంలో ప్రతిపక్షాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి....

ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి: సీఎం

రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని, రైతులకు...

Topics

ఫుడ్ పాయిజన్.. మృత్యువుతో పోరాడి ఓడిన గిరిజన విద్యార్థి

మృత్యువే గెలిచింది.. దాదాపు 20 రోజులకుపైగా నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

RGV: రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్దం! హైదరాబాద్ కు ఏపీ పోలీసులు

ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ కోసం...

పండుగ వాతావరణంలో ప్రజాపాలన విజయోత్సవాలు

డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img