Home News Telangana KTR: CM అంటే కటింగ్ మాస్టరా..? ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల తగ్గింపుపై కేటీఆర్ ఫైర్

KTR: CM అంటే కటింగ్ మాస్టరా..? ప్రభుత్వ పథకాలలో లబ్దిదారుల తగ్గింపుపై కేటీఆర్ ఫైర్

ప్రతీ పథకంలో లబ్దిదారుల సంఖ్యకు కోత పెట్టడమే రేవంత్ సర్కార్ లక్ష్యమా?.. CM అంటే కటింగ్ మాస్టరా?.. అని ప్రభుత్వ పథకాల అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‘ వేదికగా విమర్శలు గుప్పించారు.

ఎన్నికలకు ముందు పరుగు పరుగున వెళ్లి రైతులను లోన్ తెచ్చుకోమన్నారు.. కానీ, అధికారంలోకి వచ్చాక.. నేడు 2 లక్షల రుణమాఫీకి సవాలక్ష కొర్రీలు పెడుతున్నారని అన్నారు. రైతు రుణమాఫీ మొత్తం ₹39 వేల కోట్లు అని.. ఇప్పుడు ₹31వేల కోట్లకు కటింగ్ పెట్టి కుదించారని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రేషన్ కార్డు లేదని.. లక్షలాది మందిని ₹500 సిలిండర్ పథకానికి దూరం చేశారన్నారు. అలాగే, 200 యూనిట్ల కరెంటు పథకానికి ఆంక్షలు పెట్టి ఆగమాగం చేశారని తెలిపారు. 2 లక్షల రైతు రుణమాఫీని కూడా ఎగ్గొట్టి.. లక్షలాది మంది రైతులకు ఎగనామం పెడతామంటే కుదరదని ప్రభుత్వాన్నిహెచ్చరించారు. నాట్ల నాడు ఇవ్వాల్సిన రైతుబంధు ఇంకా రావడం లేదన్నారు. ఎకరానికి రూ.7500ల రైతుభరోసాకు అడ్రస్సే లేదని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రచారంలో “అందరికీ అన్నీ” అన్నారనీ.. కానీ, అధికారంలోకి రాగానే “కొందరికే కొన్ని” అనే చందంగా కోత పెడుతున్నారని తెలిపారు. రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ మాట తప్పినా… మడమ తిప్పినా… లక్షలాది రైతు కుటుంబాల తరపున ప్రశ్నిస్తాం, పోరాడుతామని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు.

Share the post
Exit mobile version