హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టుకు భక్తులు తాకిడి ఎక్కవైంది. కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. హనుమంతుడి దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పడుతుంది. హనుమాన్ మాల విరమణలు, మొక్కులు చెల్లించేందుకు భక్తులు వేలాదిగా కొండగట్టుకు తరలి రావడంతో ఆలయ పరిసరాలు క్రిక్కిరిసిపోయాయి. హనుమంతునికి ఇష్టమైన అరటిపండ్లతో ఈరోజు దేవున్ని అలంకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.