తెలంగాణ బీజేపీ చీఫ్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని బీజేపీ అధిష్టానం నియమించింది. అంతకు ముందు తెంగాణ అధ్యక్ష పదవికి బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌కు కీలక పదవి దక్కింది. ఆయనను తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా నియమించారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాష్ట్రంపై బీజేపీ అధి నాయకత్వం ఫోకస్ పెట్టింది. ప్రత్యేక వ్యూహంతో బీజేపీ ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీలో భారీ మార్పులకు సిద్ధమైంది. ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ బండి సంజయ్‌ను ఆ పదవి నుంచి తప్పించింది. ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ఊహాగానాలు వినపడుతున్నాయి.