కాంగ్రెస్ పార్టీ నేతలు పగటి కలలు కంటున్నరని , ఆ పార్టీ గెలిచేది లేదని, ఆ పార్టీ నేతలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అస్సలు రానే రాదని ఆయన తెలిపారు. 10 సంవత్సరాల కాలం అధికారంలో ఉన్న పార్టీ పైన కొంత అసంతృప్తి అనేది సహజంగా ఉండొచ్చని ,కానీ తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంపూర్ణ విశ్వాసం ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతోందని ప్రజలకు విశ్వసనీయత ఉందని చెప్పారు. ఆలోచన చెయ్యకుండా ఆగం అయ్యి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తారకు చేస్తారని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గొప్ప విజన్ ఉందని ,ఆయననే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకొంటున్నారని, మళ్ళీ బి ఆర్ యస్ పార్టీకే ప్రజలు పట్టం కడుతారని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. నూటికి నూరు శాతం మళ్లీ బి ఆర్ యస్ సర్కార్ నే ఏర్పడుతుందని, అందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తూ ప్రజలను మోసం చేస్తోందని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్స్ కర్ణాటక రాష్ట్రంలోనే అమలు కావడం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ యస్ పార్టీకి ప్రజల సంపూర్ణ మద్దతు ఉందని, సంపూర్ణ మెజార్టీతో కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఏం ఐ ఏం ,బి ఆర్ యస్ ఒక్కటే అని బీజేపీ పార్టీ, బిజెపి ,బి ఆర్ యస్ ఒక్కటే అని కాంగ్రెస్ పార్టీల నేతలు అసత్యపు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు.
ఒక్క అవకాశం ఇవ్వమని అడుగుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ ప్రజలు నాలుగు సార్లు అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేసారని ఆయన ప్రశ్నించారు. కేంద్రమంత్రి ,బి జేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సైతం కేసీఆర్ పైన తప్పుడు ప్రచారం చేస్తున్నాడని, అసలు ఆయన కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి, ఆయన నియోజక వర్గానికి కేంద్రం నుండి ఏం నిధులు తీసుకువచ్చారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాందవుడని ఆయన పాలనలోనే రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. బి ఆర్ యస్ పార్టీని ఆదరించకపోతే రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, బిసి బంధు, 24 గంటల ఉచిత కరెంట్ , వంటి సంక్షేమ పథకాలు ఆగిపోయి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మళ్ళీ బి ఆర్ యస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గా హ్యాట్రిక్ సాదిచడం పక్కా అని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.