కర్ణాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ రాజకీయలలో రోజుకో రకమైన పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఇన్నాళ్లూ బీజేపీ పై విమర్శలు కురిపించిన గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీ పై ఫోకస్ షిప్ట్ చేశారు. తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అని అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. ఆ దిశగానే బిఆరెస్ బాస్ వ్యూహం రచిస్తున్నారు. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలి అని నియోజకవర్గ స్థాయిలో ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం చేపడుతు ప్రజల్లో మమేకం అయ్యే విధంగా బీఆరెస్ నేతలతో పాటు, స్వయంగా కెసిఆర్, కేటీర్ కూడా పర్యటనలు చేస్తున్నారు. కెసిఆర్ ప్రతి సభలో నేరుగా కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేస్తుండటం కాంగ్రెస్ పార్టీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికలు ఫలితాల తర్వాత బీజేపీ నష్టాన్ని పూడ్చుకునే పనిలో బిజీ అయ్యింది. మరల తన గ్రాఫ్ పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది.. మహాజన సంపార్క్ అభియాన్ కార్యక్రమం ద్వారా బీజేపీ పెద్దలు తరచూ తెలంగాణ రావటం ద్వారా బీజేపీ నేతలు, కార్యకర్తలలో భరోసా నింపే విధంగా రాష్ట్ర పర్యటనలు జరుగుతున్నాయి. అయినా కూడా తెలంగాణ బీజేపీని స్తబ్ధత ఆవరించింది. ఇంతవరకూ దూకుడు మీదున్న కాషాయ నేతల్లో కొంచెం జోరు తగ్గిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే నేతల మధ్య విభేదాలు, అసంతృప్తి జ్వాలలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దాంతో, బీజేపీని సెట్‌రైట్ చేసేందుకు రంగంలోకి దిగింది హైకమాండ్. నేతల మధ్య సయన్వయ లోపం, కేడర్‌లో అయోమయం, నేతల్లో అసంతృప్తిని తొలగించే పనిలో పడింది అగ్రనాయకత్వం. అలాగే మహాజన్ సంపర్క్ అభియన్ కార్యక్రమం తో బీజేపీ సర్కార్ 9 ఏళ్ళ లో సాధించన విజయాలు ప్రజా సంక్షేమం కొరకు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిసేలా కార్యక్రమలు నిర్వహిస్తున్నారు. ఈ విధంగానైనా తన గ్రాఫ్ పెంచుకునే పనిలోఉంది కమలం పార్టీ.
కాంగ్రెస్ పార్టీ మాత్రం గేర్ మార్చి స్పీడ్ పెంచింది. కర్ణాటక రిజల్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యం గా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే బీఆరెస్, బీజేపీ నుండి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యేందుకు పార్టీ లోకి ఎవరు వచ్చిన ఆహ్వానిస్తాం అని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఇక పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతం కోసం అవసరం అయితే 10 మెట్లు దిగటానికి కూడా సిద్ధం అని ప్రకటించారు. కర్ణాటక లో ఒక యూనిటీగా వర్క్ అవుట్ చేసి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. దాని నిదర్శనం గానే అంతర్గత విభేదాలకు చెక్ పెట్టి కాంగ్రెస్ నేతలు అందరు ఒక్క తాటిపైకి వచ్చి విజయం సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
గత కొన్నిరోజులుగా కాంగ్రెస్ పార్టీ లోకి పొంగులేటి , జూపల్లి వస్తారు అంటూ విస్తృత ప్రచారం జరిగుతోంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నట్లు తేదీలు కూడా ఖరారు అయ్యాయి. మొదట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణరావ్ బిఆరెస్ నుండి బయటకు వచ్చాక సొంత పార్టీ పెట్టాలా.. లేక బీజేపీ లోకి వెళ్లాలా.. అని సుదీర్ఘ చర్చలు జరిపారు.. తమ మద్దతు దారులు, అనుచరులతో అనేక చర్చలు, ఆత్మీయ సమ్మేళనలు నర్వహించారు. ఆ తర్వాత ఎన్నికల కు గడువు తక్కువ ఉండటం తో సొంతగా పార్టీ పెట్టాలి అనే ఆలోచన విరమంచుకున్నారు. ఇక బీజేపీ లోకి వెళ్లిన వారికి అంతగా ప్రాముఖ్యత లేదని గ్రహించి బీజేపీ లోకి వెళ్లే ప్రయత్నం కూడా విరమించుకున్నారు. గత 6 నెలలుగా సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నట్లు దాదాపు ఖరారు చేశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఇతర నాయకులు పొంగులేటి ఇంటికి వెళ్లి అధికారం గా పార్టీ లోకి రావాలని ఆహ్వానించారు. దీనికి వారు సానుకూలం గా స్పందించారని.. పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నట్లు తెలిపారు.
ఏ పార్టీ లోకి వెళ్లినా, తన సొంత గడ్డపై నే పార్టీ మారుతాను అని పలుమార్లు చెప్పారు పొంగులేటి. జులై 2న ఖమ్మం లో జరిగే భారీ బహిరంగ సభలో రాహుళ్ గాంధీ ఆధ్వర్యంలో పార్టీ లోకి రానున్నట్లు సమాచారం. ఇక జూపల్లి కూడా మహబూనగర్ గడ్డపై భారీ బహిరంగ సభలో చీఫ్ గెస్ట్ గా ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కీలకం గా మారానున్నది. ఈ భేటీలో కాంగ్రెస్ లో చేరికలు గురించి, ఎన్నికలలో కాంగ్రెస్ వ్యవహరించే వ్యూహలపై చర్చకు వస్తుందని తెలుస్తోంది. ఎన్నికలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో రాజకీయ వ్యూహ ప్రతి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ విజయ కేతనం ఎగుర వేస్తుందో.. తెలంగాణ ప్రజలు ఏ పార్టీ కి పట్టం కడుతారో.. వేచి చూడాలి.