సీఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ల చిత్రపటాలకు జెపిఎస్ లు పాలాభిషేకం చేశారు. జెపిఎస్ లకను క్రమబద్ధీకరించేందుకు ప్రక్రియ చేపట్టిన సీఎం కెసిఆర్ కు అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీలు మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. జెపిఎస్ ల రెగ్యులరైజ్ విధి విధానాలపై కమిటీ నివేదిక రాగానే రెగ్యులరైజ్ ప్రక్రియ చేపడతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.