శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాను పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈవార్తలపై జాన్వీ వివరణ ఇచ్చారు. “మిస్టర్ అండ్ మిసెస్ మహి” సినిమా ప్రమోషన్ ఇంటర్వూలో పెళ్లిపై క్లారిటీ ఇచ్చారు. ఒక వెబ్ సైట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ మాట్లాడుతూ.. తాను కొన్ని వార్తలను ఇటీవల చూసానని.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నానని రాశారని అన్నారు. కానీ అది నిజం కాదని తెలిపారు. ఇలాగే ఊరుకుంటే.. ఏకంగా వారం రోజుల లోపలే తనకు పెళ్లికూడా చేస్తారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన దృష్టి మెత్తం కెరీర్ పైనే ఉందనీ.. పెళ్లి ఆలోచనలు లేవని జాన్వీ తేల్చి చెప్పింది.