చంద్రయాన్ 3 విజయం తరువాత ఇస్రో మరో భారీ ప్రయోగాన్ని చేపట్టింది. సూర్యుని రహస్యాలను తెలుసుకునేందుకు భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఈరోజు ఆదిత్య ఎల్ 1 మిషన్ ను పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ఆదిత్య ఎల్ 1 రాకెట్ ఉదయం 11.50 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది.
భూమి దిగువ కక్ష్యలో ఉన్న లాగ్రేజియన్ పాయింట్ లో ఆదిత్య ఎల్ 1 నౌకను చేర్చడం, అక్కడి నుండి సూర్యుడి విషయాల గురించి అధ్యయనం చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఈ మిషన్ ద్వారా అంతకిక్షం వాతావరణంలో సూర్యుని పాత్రపై పరిశోధనలు చేయడం ఇస్రోకు వీలు అవుతుంది. నింగిలోకి వెళ్లిన ఆదిత్య ఎల్ 1 తాను నిర్దేశించుకున్న లాగ్రాంజ్ పాయింట్ ను చేరడానికి 125 రోజులు అంటే నాలుగు నెలల సమయం పడుతుంది. భూమి నుండి 15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఇది ఎల్ 1 పాయింట్ కక్ష్యలోకి చేరుతుంది. ఈ పాయింట్ వద్ద భూమి, సూర్యుని రెండింటి గురుత్వాకర్షణ శక్తులు సమానంగా ఉంటాయి. ఈ పాయింట్ లో ఆదిత్య ఎల్ 1 అంతరిక్ష నౌక బ్యాలెన్సింగ్ గా ఉంటుంది. అక్కడ ముఖ్యంగా సూర్యుడి కరోనా, సౌర తుపాన్ల లాంటి ఇతర వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది.ఈ ప్రయోగం కోసం భారత ప్రభుత్వం 46 మిలియన్ డాలర్లను ఖర్చు చేసింది.
PSLV-C57/Aditya-L1 Mission:
— ISRO (@isro) September 2, 2023
The launch of Aditya-L1 by PSLV-C57 is accomplished successfully.
The vehicle has placed the satellite precisely into its intended orbit.
India’s first solar observatory has begun its journey to the destination of Sun-Earth L1 point.
Aditya-L1 started generating the power.
— ISRO (@isro) September 2, 2023
The solar panels are deployed.
The first EarthBound firing to raise the orbit is scheduled for September 3, 2023, around 11:45 Hrs. IST pic.twitter.com/AObqoCUE8I