ఇండియ్ ఎయిర్ ఫోర్స్ లో లైంగిక వేదింపుల కేసు కలకలం రేపుతోంది. ఎయిర్ ఫోర్స్ లోని వింగ్ కమాండర్ తనపై లైంగికదాడి జరిపారని ఓ మహిళా అధికారి పోలీసులకు పిర్యాదు చేశారు. జమ్ము కశ్మీర్ లోని బుద్గాం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై దర్యాప్తు జరుపుతున్న పోలీసులకు సహకరిస్తున్నామని వాయుసేన అధికార వర్గాలు మంగళవారం తెలిపాయి. నిందితుడు వాయుసేనలో వింగ్ కమాండర్ గా.. మహిళా ఉద్యోగి ఫ్లెయింగ్ ఆఫీసర్ గా కశ్మీర్ లోనే పని చేస్తున్నట్టు తెలిపారు. గత సంవత్సరం డిసెంబరు 31న శ్రీనగర్ లోని ఆఫీసర్స్ మెస్ లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తన సీనియర్ అయిన వింగ్ కమాండర్.. నూతన సంవత్సర బహుమతులు తన ఇంట్లో ఉన్నాయని చెప్పి ఆమెను అక్కడికి తీసుకెళ్లాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడ తాను ఎంత అడ్డుకుంటున్నా వినకుండా ఆ అధికారి తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిపారు. కొన్ని రోజులపాటు తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని తెలిపారు. అనంతరం ఇద్దరు మహిళా అధికారుల సహకారంతో తమ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. కల్నల్ స్థాయి అధికారి దీనిపై దర్యాప్తు అధికారిగా నియమితులయ్యారని… అయినా ఏమీ తేల్చకుండానే దర్యాప్తు ముగిసిందన్నారు. దీంతో తాను అంతర్గత కమిటీకి ఫిర్యాదు చేసినా.. ఆ కమిటీ కూడా నిందితుడికి హకరిస్తున్నట్లుగానే వ్యవహరించిందని అన్నారు. తాను ఒత్తిడి చేస్తేగానీ తనకు కనీసం వైద్యపరీక్షలు కూడా నిర్వహించలేదన్నారు. అతడికి సహకరిస్తున్న అధికారులతో కలిసి ప్రతిరోజూ పని చేయాల్సి వచ్చిందని, సదరు మహిళా అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను సామాజికంగా వెలివేసినట్లుగా వ్యవహరించారని, ఎవరైనా తనతో మాట్లాడితే వారిని ఉన్నతాధికారులు వేధించేవారని ఆవేదన వ్యక్తం చేశారు.
Rape row rocks #IndianAirForce #IAF responds charges of #rape made against a #wingcommander
— Mirror Now (@MirrorNow) September 10, 2024
An Air Force officer has accused her senior official at #JammuAndKashmir station of rape
Watch #NationTonight with @ShreyaOpines | @shreyadhoundial pic.twitter.com/8IhkSOrHOQ