స్వాతంత్ర సమరయోధుడు, మాజీ భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని పురస్కరించుకొని, ఆయన గౌరవార్థం బాలనగర్లో ప్రభుత్వం నిర్మించిన ఫ్లైఓవర్ కు ఆయన పేరు పెట్టారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను జారీ చేసింది. దేశంలో సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప నాయకుడు.. అద్భుతమైన పార్లమెంటేరియన్ గా బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను చిరకాలం గుర్తుండేలా నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తెలిపింది.