భర్త శవంతో ప్రియుడి బైక్‌పై ఊరంతా తిరిగి ఓ మహిళ అందరినీ షాక్ కు గురి చేసింది. తన భర్తను చంపేసి, ఆ శవాన్ని ప్రియుడి బైక్‌పై పెట్టుకుని ఊరంతా చక్కర్లు కొట్టారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.
Also Read.. | కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ‘ఎక్స్’ దావా !
మృతుడు ధన్నలాల్ సైని, అతని భార్య గోపాలి దేవి, ఆమె ప్రియుడు దీన్దయాల్ కుశ్వాహ.. వీరంతా ఒకే గ్రామంలో నివసిస్తున్నారు. మృతుని భార్యకు దీన్దయాల్ కుశ్వాహతో అక్రమ సంబంధం ఉంది. ఇది భర్తకు తెలియకుండా కొంతకాలంగా కొనసాగుతోంది. అయితే, గోపాలి దేవి తన ప్రియుడు దీన్దయాల్ కుశ్వాహకలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత అతని శవాన్ని బైక్‌పై పెట్టుకుని ఊరంతా తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది.

స్థానికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘోరమైన నేరానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అక్రమ సంబంధాల వల్ల ఎంతటి దారుణాలు జరుగుతాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.